VSP: సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా 20వ వార్డు గాంధీ సెంటర్లో బైరెడ్డి పోతన్నరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మనసులను గెలుచుకున్న నాయకుడు, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించే దిక్సూచి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.