NLG: దేవరకొండ మండలం అచ్చమ్మకుంట తండాకు చెందిన నేనావత్ అనిల్ కుమార్కు బీఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్-2026 అవార్డు దక్కింది. ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయగాన సభలో ప్రముఖ నటులు డాక్టర్.బాలిరెడ్డి, పృద్విరాజ్, తెలుగు హీరో రాంకీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఆయన గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేశారు.