తూ.గో: విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందిన ఘటన రాజమండ్రిలోని బొమ్మూరు నవభారతినగర్లో ఆదివారం సాయంత్రం జరిగింది. ఓ ప్రకటన బోర్డును తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో వేణుగోపాలరావు, రేచర్ల డేవిడ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బొమ్మూరు ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.