KDP: ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు జిల్లాలో మాజీ CM YS జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారికంగా షెడ్యూల్ విడుదలైంది. బెంగళూరు నుంచి 21వ తేదీ మధ్యాహ్నం పులివెందులకు వస్తారు. అక్కడ కార్యకర్తలతో మాట్లాడనున్నారు. 22వ తేదీన ఉదయం లింగాల(M)లో పర్యటించి మధ్యాహ్నం నుంచి కార్యకర్తలతో సమావేశం అవుతారు. 23వ తేదీన ఉదయం ఆయన పులివెందుల నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు.