WGL: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో సోమవారం MLA KR నాగరాజు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా MLA మొదట హసన్‌పర్తిలో DCB బ్యాంక్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం సీతంపేట గ్రామంలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులు హాజరై విజయవంతం చేయాలన్నారు.