RR: కేశంపేట మండల పరిధిలోని నిర్దవెల్లి గ్రామపంచాయతీ శ్యామ్ రావు తండాలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తండాలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో శిబిరంలో వైద్యులు ఉచితంగా గుండె వైద్య పరీక్షలు నిర్వహించారు. నిరుపేదలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.