GNTR: నగరంలో రహదారి విస్తరణ, విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు లక్ష్మీపురం మెయిన్ రోడ్, అశోక్ నగర్ ప్రాంతాలు ప్రభావితమవుతాయి. ప్రజలు ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.