AP: సింహాచలంలో వరహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పన్నస్వామి నిజరూపంలో దర్శనమిస్తున్నారు. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. హోంమంత్రి అనిత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. చందనోత్సవం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులను స్వామిని దర్శించుకుంటున్నారు.