ASF: ఆసిఫాబాద్ పట్టణం జన్కాపూర్ లోని భవిత సెంటర్ను శనివారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాన్ని పరిశీలించి, పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, సూచించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.