వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో రేపు హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరుగనుంది. RSS వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు పరిగి మున్సిపల్ పరిధిలోని మినీ స్టేడియం గ్రౌండ్లో సమ్మేళనం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి హిందువులు భారీ ఎత్తున హాజరు కావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.