WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అన్నమనేని వీర సంజీవరావు శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.