KDP: బ్రహ్మంగారి మఠంలో ఈనెల 23 నుంచి 28 వరకు జరిగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆర్డీవో చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, మెడికల్ క్యాంపులు, భద్రతా బందోబస్తు, వడదెబ్బ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. యాత్రికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.