ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వనమా వేణుగోపాలరావు శనివారం TGSRTC మధిర డిపో మేనేజర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం ఖమ్మం నుంచి తిరుపతికి వయా మధిర మీదుగా బస్సును నడపాలని కోరారు. అలాగే మధిర టు శ్రీశైలం బస్సులు కూడా ప్రారంభించాలని వెల్లడించారు. డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించినట్లు అన్నారు.