శనివారం కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తారు. ఈ రోజు ఇనుము, నూనె, ఉప్పు, నల్ల నువ్వులు, చీపురు వంటి వస్తువులను కొనడం అశుభమని చెబుతున్నారు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు తీసుకోవడం వంటి పనులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మాంసం, మద్యం సేవించకూడదు. ఈ నియమాలు పాటించడం వల్ల శని ప్రభావం తగ్గి, శుభం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.