SKLM: జిల్లాలో ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, కంచిలి, లక్ష్మీనర్సుపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాల్లో తీవ్ర వడగళ్లకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు. దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని X వేదికగా ప్రకటించారు. ప్రజలు తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.