పాత రూ.500, రూ.1000 నోట్లను కొత్త నోట్లతో మార్చుకోవచ్చని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, RBI అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దు అని, ఆర్థిక లావాదేవీల సమాచారం కోసం RBI అధికారిక సైట్ను మాత్రమే నమ్మాలని కోరింది. ఏవైనా అనుమానాలు ఉంటే వాట్సాప్ (+91 8799711259) ద్వారా సంప్రదించవచ్చు అని తెలిపింది.