E.G: నిరుద్యోగ రహిత రాజమండ్రి లక్ష్యమని, యువతకు ఉపాది కల్పించే లక్ష్యంతో రేపు స్థానిక మార్గాని ఎస్టేట్లో జాబ్ మేళా నిర్వహిస్తునట్లు మాజీ ఎంపీ భరత్ రామ్ తెలిపారు. గత జనవరిలో మెగా జాబ్ మేళా నిర్వహించి, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. శుక్రవారం ఆయన రాజమండ్రిలో జాబ్ మేళా గోడ పత్రికను ఆవిష్కరించారు.