NDL: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సీఎం చంద్రబాబును ఇవాళ ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పట్ల తన నిబద్ధతను కొనసాగిస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.