ఖలీల్ అహ్మద్ గాయంతో దూరమవ్వడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు CSK వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలో MI మాజీ పేసర్ ఆకాష్ మధ్వల్ CSK నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మధ్వల్తో పాటు మరికొందరు బౌలర్లను కూడా పరిశీలిస్తున్నామని చెన్నై CEO తెలిపాడు. అందరినీ పరీక్షించిన తర్వాతే ఖలీల్ స్థానంలో తుది రీప్లేస్‌మెంట్‌ను ప్రకటిస్తామని పేర్కొన్నాడు.