WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభం కానుంది. శుక్రవారం అమావాస్య, నిన్న, నేడు వారంతపు సెలవుల నేపథ్యంలో మూడు రోజులు మార్కెట్ బంద్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు మార్కెట్ ప్రారంభం కానున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఎండాకాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులు మార్కెట్కు తీసుకొని రావాలని సూచించారు.