BHPL: మహాముత్తారం మండలం పోలంపల్లిలో గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలోని బోర్ మోటార్ మరమ్మతు కావడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ కొండ గొర్ల బాపు వెంటనే స్పందించి, సొంత చొరవతో కొత్త మోటార్‌ను ఏర్పాటు చేయించారు. గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడడమే లక్ష్యమని అన్నారు. వాడు మెంబర్లు ఉన్నారు.