NZB: ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సర్పంచ్ తోగర్ల భూషణ్, పంచాయతీ కార్యదర్శి నరేంద్ర వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం ఎంపీడీవో గంగాధర్, మాక్లూర్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.