NGKL: నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య, ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లవద్దని, నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని కోరారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.