కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో 141 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ విక్టర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను, ఆయా శాఖల అధికారులకు అప్పగించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని వివరించినట్లు ఆయన చెప్పారు.