BPT: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని, పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని మార్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. పాఠశాల ఆవరణలో శనివారం నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ సమతుల్యత, చెట్ల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.