SRD: సిర్గాపూర్ మండలం లక్ష్మణ్ నాయక్ తండాలో నీటి సమస్య తీరింది. గత పదేళ్ల నుంచి మంచినీటి సరఫరా బోరుకు పట్టిన గ్రహణం వీడింది. సోమవారం స్థానిక సర్పంచ్ దూరిబాయి విట్టల్ నాయక్ గ్రామ నీటి సరఫరా బోరును ప్రారంభించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని 5 నెలల్లోనే నెరవేర్చి నీటి సమస్య తొలగించినట్లు సర్పంచి తెలిపారు.