KNR: శంకరజయంతి సందర్భంగా కరీంనగర్ పాత బజార్ శివాలయంలో నిర్వహించనున్న మూడు రోజుల ఉత్సవాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని సన్మానించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణంగా నెలకొంది.