NRML: జిల్లాలో నదులు పారుతున్నా ప్రణాళిక లోపం వల్ల సాగునీటి కష్టాలు తప్పడం లేదు. జలయజ్ఞం ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగలడం, కాలువలు పూడికతో నిండిపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. నీటి వనరులు పుష్కలంగా ఉన్నా అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ఖరీఫ్ సాగుపై నీలినీడలు కమ్ముకోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.