TG: గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశంపై చర్చించారు. ఇద్దరు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని సీఎం కోరారు. ప్రొ.కోదండరామ్, అజారుద్దీన్లను ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రేవంత్‌తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.