HYDలో కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. గతంతో పోలిస్తే ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులకు భారంగా మారాయి. ప్రస్తుతం ఉప్పల్, తార్నాక, ఎల్బీనగర్, కాచిగూడ ప్రాంతాల్లో 30 గుడ్లు రూ.170 నుంచి రూ.185 వరకు అమ్ముడవుతున్నాయి. డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.