GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ గ్రామ స్థాపకుల్లో ఒకరైన ప్రముఖ విద్యావేత్త బసవ పున్నయ్య (98) ఆదివారం కన్నుమూశారు. 1968లో పాఠశాల స్థాపనతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆయన మృతి పట్ల పట్టణ ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.