RR: జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని పలు సినిమా థియేటర్లలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక అధికారి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. థియేటర్ యాజమాన్యం, ప్రేక్షకులకు అగ్నిమాపక పరికరాల వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.