TG: వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంక్‌ను గుప్పిట్లో ఉంచుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకే పడేలా ఈవీఎంలను డిజైన్ చేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్‌ను బీజేపీ తమ చేతుల్లో పెట్టుకుందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆయన విమర్శించారు.