కడపలో CPM జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.131వ రాజ్యాంగ సవరణ, డీ-లిమిటేషన్ బిల్లు రాష్ట్రాల హక్కులను బలహీన పరుస్తుందని మండిపడ్డారు. జనగణన పూర్తయ్యాకే నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కోరారు. మండల, సచార్ కమిషన్ సిఫారసులను పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శించారు.