KDP: చైత్రమాసం ఇవాళ అమావాస్య సందర్భంగా బద్వేల్లోని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మను కమిటీ సభ్యులు విశేషంగా అలంకరించారు. గుమ్మడికాయలు, నిమ్మకాయల దండలు, మల్లె పూలతో చేసిన ఈ ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. పూలు, ఆకులతో చేసిన అలంకరణ మధ్య అమ్మవారి తేజోవంతమైన రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.