KRNL: ఆలూరు మండలం ఎం.కొట్టాల గ్రామంలో ఇవాళ తాగునీటి సమస్యపై మహిళలు, గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. ఖాళీ బిందెలతో చెక్పోస్ట్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిరసన తెలిపారు. నెల రోజులుగా నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.