ముంబై స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. విరాట్(RCBకి 8840 రన్స్) తర్వాత IPLలో ఒకే జట్టు తరఫున 6000+ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 2011 నుంచి ముంబైకి ఆడుతున్న రోహిత్ ఇప్పటివరకు ఆ జట్టు కోసం 6013* రన్స్ చేశాడు. ఒవరాల్గా ఈ లిస్టులో ధోనీ(CSKకి 4865), రైనా(CSKకి 4687), AB డివిలియర్స్(RCBకి 4491) తర్వాతి 3 స్థానాల్లో ఉన్నారు.