రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో రాబోతున్న ‘జైలర్ 2’ మూవీ అప్పుడే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. ఈ సినిమా OTT హక్కుల విషయంలో కోలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డీల్ కుదిరినట్లు సమాచారం. ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.160 కోట్లు వెచ్చించి అన్ని భాషల హక్కులను సొంతం చేసుకుందట. షూటింగ్ దశలో ఉండగానే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం హాట్ టాపిక్ అయింది.