TG: మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఇవాళ ములుగు జిల్లా మేడారంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మేడారం ఆలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం పెండింగ్ పనులు, భక్తులకు కల్పించాల్సిన వసతులపై అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాబోయే కాలంలో మేడారం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.