HYD: ఇంజనీర్ ఆఫ్ సర్వే నివేదిక ప్రకారం పంజగుట్ట, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాలను కలిపే మార్గాల్లో గత ఏడాది కాలంలో 67% పైగా ట్రాఫిక్ పెరిగింది. ఐటీ సంస్థలు, కమర్షియల్ కార్యకలాపాలు పెరగడంతో వాహనాల రద్దీ అధికమైంది. ఫలితంగా పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి.