AP: మావిగన్ ప్రతిపాదనపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. మావిగన్ ప్రతిపాదనతో పరిపాలనా విభజన ప్రమాదకరమని అన్నారు. రాజధాని అనేది పరిపాలనకు నాడీ కేంద్రంగా పనిచేయాలని తెలిపారు. మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు రాజధాని ప్రాంతాన్ని 100-110 కిలోమీటర్ల మేర విస్తరించడం పరిపాలనా సమైక్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు.