NRPT: మక్తల్ నియోజకవర్గం అమరచింత మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పూల వ్యాపారి వెంకటేశ్ ఆదివారం నర్వ మండలం బెక్కరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అమరచింతలో వ్యాపారం ముగించుకుని బైక్ పై వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పూల విక్రయానికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.