NGKL: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌కు వేరుశనగ పంట భారీగా తరలిరావడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్లో నిల్వలు పేరుకుపోవడం, లిఫ్టింగ్‌లో జాప్యం కారణంగా నేడు క్రయవిక్రయాలను నిలిపివేశారు. రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు కావడంతో, తిరిగి బుధవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మార్కెట్ కమిటీ తెలిపింది.