NGKL: తాడూరు మండలంలోని ఏటిదర్పల్లి వద్ద జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను వెంటనే అడ్డుకోవాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న డిమాండ్ చేశారు. ఒకే పర్మిషన్తో పలుమార్లు ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మైనింగ్ అధికారులు ట్రాక్టర్ యజమానులతో కుమ్మక్కై ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు.