ADB: ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో 5 నుండి 9వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐటీడీఏ పరిధిలోని 16 పాఠశాలలను ‘విద్య ప్లస్’ (Vidya Plus) పాఠశాలలుగా మార్చనున్నట్లు ప్రకటించారు. ప్రవేశ పరీక్షలో ఎంపికైన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తామని ఆయన వివరించారు.