TG: ఇది దేశ చరిత్రలో ఎర్ర అక్షరాలతో నిలిచే రోజు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాల ఐక్యత గెలిచింది. దేశంలో ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ జరిగింది. బిల్లులను ఓడించిన ప్రతిపక్షనేతలకు కృతజ్ఞతలు. స్టాలిన్, మమత, అఖిలేష్, ఉద్ధవ్ నేతృత్వం అభినందనీయం. కమ్యూనిస్టు పార్టీల సహకారం కీలకం. జై హింద్’ అంటూ ట్వీట్ చేశారు.