అన్నమయ్య: జిల్లా ఖజానా ఆదాయం పెంపు లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, పన్నుల వసూళ్లలో పారదర్శకత, సమర్థత పెంపుతో ఆదాయ వృద్ధి సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.