BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐడీవోసీ వద్ద తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ గెజిటెడ్ అధికారుల ఉపాధ్యాయుల&పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఛైర్మన్ బూరుగు రవికుమార్ మాట్లాడుతూ.. 30 నెలలు దాటినా పీఆర్సీ ఇవ్వడం లేదని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.