W.G: రాష్ట్రంలో ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు తన కుటుంబ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఈ నమోదు చేపట్టారు. నరసాపురం ఆర్డీవో దాసురాజు మంత్రికి ఈ విధానం, ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు.