MBNR: రహదారి ప్రమాదాల సమయంలో క్షతగాత్రుల ప్రాణాలు ఎలా కాపాడాలో పోలీసులు నిర్వహించిన అవగాహన సదస్సు ఆకట్టుకుంది. ఎస్సై తిరుపాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయాల్లో భయపడకుండా స్పందించే తీరుపై యువతకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నవారిని సొంత మనుషులుగా భావించి సాయం చేయాలని సూచించారు. పోలీసుల చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.